: 17, 18 తేదీల్లో సీమాంధ్ర బంద్: ఏపీఎన్జీవో
ఈ నెల 17, 18 తేదీల్లో సీమాంధ్ర బంద్ కు పిలుపునిస్తున్నట్టు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. అసెంబ్లీలో సీమాంధ్ర ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిపై జరిగిన దాడిని ఏపీఎన్జీవోలు ఖండిస్తున్నారని చెప్పారు. ఇలాంటి దాడులతో ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని అన్నారు. ఈ రోజు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో టీబిల్లుపై చర్చించాలని, ఓటింగ్ సమయంలో ఓడించాలని అన్నారు. ఈ నెల 20న అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ సమైక్య రాష్ట్రం కోసం పారాడాలని కోరారు. తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగులబెట్టే కార్యక్రమాన్ని ఈ నెల 13న నిర్వహిస్తామని చెప్పారు.