: శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ బస్సులను అడ్డుకుంటాం: సీపీఐ నారాయణ
ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా మత్తులో ప్రభుత్వం జోగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. పాలెం వోల్వో బస్సు బాధితులను ఆదుకోవడంలో సర్కారు పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. 45 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. బాధితులకు న్యాయం చేయకుంటే శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులను అడ్డుకుంటామని హెచ్చరించారు. బస్సు ప్రమాదంపై అప్పట్లో గొప్పగా స్పందించిన ప్రభుత్వం, ఆ తర్వాత లక్ష రూపాయల నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు.