: 10వేలు పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10వేల ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 22,500 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపితే 50వేల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఒకేసారి ఈ స్థాయిలో పెరగడం వల్ల పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరడంతో పాటు, వైద్యుల సంఖ్య కూడా పెరగనుంది. ప్రస్తుతం ప్రతీ 2000 మంది రోగులకు ఒక్క వైద్యుడే అందుబాటులో ఉన్నారు. దీన్ని 1000:1కి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.