: సివిల్స్ లో ప్రాంతీయ భాషల రద్దుపై వెనక్కి తగ్గిన కేంద్రం
సివిల్స్ పరీక్షల్లో ప్రాంతీయ భాషల రద్దు వ్యవహరంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. యూపీఎస్సీ నోటిఫికేషన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈరోజు లోక్ సభలో కేంద్రం ప్రకటన చేసింది. కొన్నిరోజుల కిందట యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ నోటిఫికేషన్ లో భాగంగా ఆంగ్లం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలువురి నుంచి విమర్శలు, వ్యతిరేకత వెల్లువెత్తాయి.