: మహిళల కోసం చిన్న రివాల్వర్.. దేశీయంగా తయారీ
మహిళల కోసం అతిచిన్న, తక్కువ బరువున్న రివాల్వర్ ను ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసింది. .32 బోర్ రివాల్వర్ బరువు 500 గ్రాములు. దీని ధర 1,22,360 రూపాయలు. నిర్భయకు నివాళిగా కాన్పూర్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దీన్ని నిర్భీక్ పేరుతో విడుదల చేసింది. 20 రివాల్వర్ల కోసం ఇప్పటికే బుకింగులు కూడా వచ్చాయి.