: బిల్లుపై ఓటింగ్ జరగాలనే కోరుకుంటున్నా: దిగ్విజయ్ సింగ్
తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ఉండదని నేనెప్పుడూ అనలేదని... ఓటింగ్ జరగాలనే తాను కోరుకుంటున్నానని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై శాసనసభకు రావడానికి తాను సిద్ధమని తెలిపారు. తాను చెప్పింది తప్పయితే సభకు క్షమాపణలు చెబుతానని స్పష్టం చేశారు. సభా కార్యక్రమాలను వైఎస్సార్సీపీ అడ్డుకోవడం సరికాదని అన్నారు. చట్టసభలు, ప్రజాప్రతినిధుల అధికారాలను జగన్ తెలుసుకోవాలని సూచించారు.