: విభజన బిల్లుపై శాసనసభలో కొనసాగుతున్న చర్చ
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో చర్చ కొనసాగుతోంది. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ బిల్లుపై మాట్లాడుతున్నారు. తమ ప్రజలు తెలంగాణను ఎందుకు కోరుకుంటున్నారో, తెలంగాణ డిమాండ్ కు దారి తీసిన పరిస్థితులు ఏమిటో వివరిస్తున్నారు. కాగా, సీమాంధ్రుల పాలనలో తమను నిరంతరం తొక్కిపెడుతూనే ఉన్నారని, ఇప్పటికీ ఆ నియంతృత్వం కొనసాగుతోందని ఆరోపించారు.