: అత్యచార నిరోధక చట్టానికి బీఎస్పీ మద్దతు
'అత్యచార నేర నిరోధక చట్టం-2013'కు బహుజన సమాజ్ పార్టీ మద్దతు తెలిపింది. కొన్ని సవరణల అనంతరం నిన్న ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో..ఈ చట్టానికి తాము వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తెలిపారు. ఢిల్లీ అత్యాచార ఘటన నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ బిల్లు ఆధారంగా .. అత్యాచార నేరానికి పాల్పడితే 20 ఏళ్ల కనీస జైలు శిక్ష పడుతుంది.