: తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రం పాతదే: ఈటెల రాజేందర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజన బిల్లును స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. శాసనసభలో చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రం కొత్తది కాదని.. పాతదేనని తెలిపారు. కాబట్టి, తెలంగాణ ప్రాంతంలో నూటికి నూరు శాతం తెలంగాణ ఆకాంక్ష ఉందని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన పోరాడిన పార్టీగా (టీఆర్ఎస్) బిల్లును ఆమోదిస్తున్నామన్నారు. అరవైఏళ్ల నిరీక్షణ అనంతరం తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇంతకాలం అన్నదమ్ముల్లాగా కలసి ఉన్నామని, విడిపోయినా అలానే ఉందామని కోరారు. సమైక్య రాష్ట్రంలో ఏనాడు తెలంగాణ వారి మనసు దోచుకునే ప్రయత్నాన్ని సీమాంధ్ర నేతలు చేయలేదన్నారు.