: ఆనాడు అవునన్నారు.. ఈనాడు కాదంటున్నారు: గండ్ర


విభజన ముసాయిదా బిల్లుపై రాష్ట్ర శాసనసభలో రెండో రోజు చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ.. విభజన సరైంది కాదంటూ వ్యతిరేకిస్తున్న వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిందని తెలిపారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సరేనని అప్పుడు అన్నారని.. మరి ఇప్పుడు ఎందుకు కాదంటున్నారని ప్రశ్నించారు. ఎవరి ఆమోదం లేకుండా కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుందనడం సత్య దూరమని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగానే తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి హామీలు అమలు చేయనందునే తెలంగాణ డిమాండు వచ్చిందని గండ్ర వివరించారు.

ఇక హైదరాబాదులో భారతీయులందరికీ సమాన గౌరవం ఉంటుందని.. 'ఇక్కడ ఉండేవారి అందరి ఆస్తి హైదరాబాద్' అని అన్నారు. తెలంగాణ జిల్లాల్లో ఆంధ్రా నుంచి వచ్చిన వారు తమతో కలిసి జీవనం సాగిస్తున్నారన్నారు. తెలంగాణ ఇవ్వాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తప్పుబట్టడం సమంజసం కాదన్నారు. మంత్రి పదవులిచ్చినప్పటికీ తమను ఏనాడు గౌరవంగా చూడలేదని, తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి? అని గండ్ర ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News