: కిరణ్ బేడీ ఓటు మోడీకే!
మాజీ ఐపీఎస్ అధికారిణి, అన్నా హజారే అనుచరురాలు అయిన కిరణ్ బేడీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు. 'నా తొలి ప్రాధాన్యం భారత్. మంచి పరిపాలన, మంచి యంత్రాంగం, నిజాయతీ, భాగస్వామ్య విధానం కారణంగా స్వతంత్ర ఓటరుగా నేను మోడీకే ఓటు వేస్తాను' అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.