: రద్దయిన భారత్-పాక్ హాకీ సిరీస్


పాకిస్థాన్, భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇరుదేశాల మధ్య ఏప్రిల్ నెలలో జరగనున్న హాకీ టోర్నమెంట్ కు భద్రతా పరమైన కారణాల పేరుతో అనుమతి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ సిరీస్ ను రద్దు చేసుకోవాలని కోరుతూ విదేశీ వ్యవహారాల శాఖ నుంచి తమకు సమాచారం అందిందని భారత హాకీ సంఘం వర్గాలు తెలిపాయి. విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించినందున హాకీ సిరీస్ ను రద్దు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

  • Loading...

More Telugu News