: శాసనసభ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్
విభజన ముసాయిదా బిల్లుపై శాసనసభలో ఓటింగ్ కు స్పీకర్ అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రకటించారు. అంతేకాక సమైక్య తీర్మానంపై స్పీకర్ హామీ ఇవ్వనందుకు తాము సభనుంచి వాకౌట్ చేస్తున్నామని ఆమె సభలో చదివి వినిపించారు. ఆ వెంటనే సభ నుంచి వైఎస్సార్సీపీ సభ్యులు వెళ్లిపోయారు.