: గొంగళి పురుగును కూడా ముద్దాడుతామంటున్నారు.. మనమేం చేయాలి?: ధూళిపాళ్ల
తెలంగాణ రాష్ట్రం కోసం గొంగళి పురుగును కూడా ముద్దాడుతామని తెలంగాణ నేతలు అంటున్నారని.. అలాంటిది మన ప్రాంత ప్రజల కోసం, మన ప్రాంత ప్రయోజనాల కోసం మనమేం చేస్తున్నామని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ, సమైక్యాంధ్ర కోసం అందరం ఏకతాటిమీదకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
మెజారిటీ సభ్యులుగా ఉన్న సీమాంధ్రులను దోచుకున్నారు, తినేశారు, మోసం చేశారు అంటూ సభలో తూలనాడుతుంటే, ఏ ప్రయోజనాలను పొందని ప్రజలు భగభగ మండుతున్నారని... నేతలుగా, ప్రజాప్రతినిధులుగా ఎందుకు నిమ్మకు నీరెత్తనట్టు ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అందరం ఏకమై రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదామని ఆయన సూచించారు.