: మంత్రి పితాని ఇంటి ముట్టడికి విద్యార్థుల యత్నం


ఫీజు రీఇంబర్స్ మెంట్ నిధులను విడుదల చేయాలంటూ నిన్న మంత్రుల నివాస ప్రాంగణంలో ఆందోళన చేసిన విద్యార్థులు.. పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలంటూ మంత్రి పితాని సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లోని పితాని ఇంటికి గుంపుగా వచ్చిన విద్యార్థులు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేసి ఫీజు రీఇంబర్స్ మెంట్ తో ఆధార్ లింకును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News