: తులసిలో ఎన్ని సుగుణాలంటే...


అనాదినుండీ తులసిని చాలా పవిత్రంగా చూస్తున్నాం. ఇందులో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకులను రోజూ ఉదయం పూట కాసిన్ని తినడం వల్ల శరీరంలోని వివిధ రకాల జబ్బులు తగ్గుముఖం పడతాయి. అలాగే బుద్ధిమాంద్యం నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ముఖ్యంగా శరీర బరువు తగ్గించుకోవాలనుకునేవారు రోజూ తులసి ఆకులను తినడం వల్ల బరువు తగ్గి నాజూకుగా తయారవుతారు. శరీర బరువును తగ్గించే గుణం తులసికి ఉంది. ఇంకా వైద్య పరంగా చూస్తే తులసికి జీర్ణక్రియను మెరుగుపరచే శక్తివుంది. తులసి రసాన్ని తేనెలో కలుపుకుని తాగితే కిడ్నీలోని రాళ్లు కూడా కరిగిపోతాయి. రక్తంలో షుగర్‌ మోతాదులు పెరగకుండా తులసి నియంత్రిస్తుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసితో ఎన్ని లాభాలున్నాయో తెలుసుకున్నారుకదా... చక్కగా కాసిన్ని తులసి ఆకులను రోజూ నోట్లో వేసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి మరి.

  • Loading...

More Telugu News