: రొమ్ముక్యాన్సర్‌తో 'డి' అంటే ఢీ!


మన దేశంలో ఏటా రెండు లక్షల రొమ్ము క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని తాజా సర్వే తేల్చింది. అంతేకాదు... ఈ పరిస్థితి ఇలా ఒక పదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని కూడా ఈ సర్వే హెచ్చరిస్తోంది. అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధనా సంస్థ గ్లోబోకాన్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఏడాదికి రెండు లక్షల మంది చొప్పున, వచ్చే దశాబ్ద కాలంపాటు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని ఈ సంస్థ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఏడాదికి రొమ్ము క్యాన్సర్‌ బారిన పడేవారి సంఖ్య 1.4 లక్షలుగా ఉందని ఈ సంఖ్య 2.14 లక్షలకు చేరుకుంటుందని గ్లోబోకాన్‌ అంచనా వేసింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి ఏటా ఐదు లక్షలమంది దాకా చనిపోతున్నారని సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

శరీరంలో విటమిన్‌ 'డి' లోపిస్తే రొమ్ము క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఇప్పటి వరకూ జరిగిన పలు పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమయ్యింది. శరీరంలో 'డి' విటమిన్‌ స్థాయులు పుష్కలంగా ఉంటే రొమ్ము క్యాన్సర్‌ సోకే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రొమ్ము కణజాలంపై విటమిన్‌ 'డి' గ్రాహకాలు ఉంటాయని, అవి విటమిన్‌ 'డి'ని శోషించుకున్న తర్వాత వాటి ప్రవర్తనను అదే నియంత్రిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఆన్‌కోజెనిస్‌ వంటి ప్రమాదకర కణాలు అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుందని, రొమ్ము క్యాన్సర్‌ను నివారించే ఉత్తమమైన మార్గం శరీరంలో విటమిన్‌ 'డి' నిల్వలను పెంచుకోవడమేనని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News