: బాలీవుడ్ నటి లైలాఖాన్ హత్య కేసులో మరో ట్విస్టు


బాలీవుడ్ నటి లైలాఖాన్ హత్య కేసులో మరో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. లైలాఖాన్ తో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఐదుగుర్ని దుండగులు 2011లో దారుణంగా హత్య చేశారు. ఈ ఆరు మృత దేహాలు పోలీసుల వద్ద ఉన్నాయి. ఆ మృతదేహాలను తనకు అప్పగించాలని లైలాఖాన్ కు తండ్రిగా చెలామణి అవుతున్న నాదిర్ షా గత నెల బాంబే సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా నాదిర్ షా లైలాఖాన్ అసలు తండ్రి కాదని, ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సెషన్స్ కోర్టుకు డీఎన్ఏ టెస్టు ఫలితాల రిపోర్టులు సమర్పించారు. లైలాఖాన్ కానీ ఆమె తోబుట్టువులు కానీ ఎవరూ నాదిర్ షాకు జన్మించినవారు కాదని స్పష్టం చేశారు. గతంలో నాదిర్ షా వీరి మృతదేహాలు స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేశారు. మరో వైపు ఈ ఆరు హత్యలను లైలాఖాన్ సవతి తండ్రి పర్వేజ్ తక్ చేసినట్టు పోలీసులు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News