: ప్రముఖ చైనా దర్శకుడికి భారీ జరిమానా


ప్రముఖ చైనా దర్శకుడు జాంగ్ ఇమౌకు ఆ దేశ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. ఇన్నాళ్లు ఒక్క బిడ్డను కనేందుకు మాత్రమే తమ దేశంలోని దంపతులకు అనుమతి ఇచ్చిన చైనా, తాజాగా ఆ నిబంధనను సడలించి ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతినిచ్చింది. అయితే జాంగ్, అతని భార్య చెన్ టింగ్ మాత్రం ఏకంగా ముగ్గురు పిల్లల (ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె)ను కన్నారు. ఈ విషయాన్ని అధికారుల ముందు దర్శకుడు ఒప్పుకోవడంతో రూ.7కోట్ల 62 లక్షల రూపాయల జరిమానా విధించారు. చైనా చిత్ర పరిశ్రమలో పేరు ప్రఖ్యాతులు పొందిన జాంగ్ అనేక అవార్డులు కూడా గెలుపొందారు.

  • Loading...

More Telugu News