: విశాఖ స్టేడియానికి టెస్టు హోదా నిర్ణయం తీసుకుంటాం: రంజిత్ బిస్వాల్
విశాఖ క్రికెట్ స్టేడియానికి టెస్టు మ్యాచ్ లు నిర్వహించేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని ఐపీఎల్ ఛైర్మన్ రంజిత్ బిస్వాల్ అన్నారు. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఐపీఎల్ లో విశాఖలో కొన్ని మ్యాచ్ లు నిర్వహిస్తామని అన్నారు. బీసీసీఐ కౌన్సిల్ సమావేశంలో చర్చించి విశాఖ స్టేడియానికి టెస్టు హోదా కల్పించే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.