: తప్పొప్పుకున్న యడ్యూరప్ప


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తాను బీజేపీని విడిచిపెట్టి పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపపడ్డారు. బెంగళూరులో బీజేపీ గూటికి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతాన్ని మర్చిపోవాలని, కర్ణాటక జనతాపార్టీలోకి వెళ్లిన విషయాన్ని తాను మర్చిపోయానని, పార్టీ కార్యకర్తలు కూడా మర్చిపోవాలని కోరారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసి, కర్ణాటక నుంచి 20 సీట్లను సాధించాలని యెడ్డీ పిలుపునిచ్చారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి బయటపడతాననే నమ్మకం నూరు శాతం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News