: 50 ఏళ్ల నాటి స్క్రిప్టుతో స్పిల్ బర్గ్ కొత్త సినిమా


హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్ బర్గ్ మనసు యాభై ఏళ్ల నాటి ఓ స్క్రిప్టుపైకి మళ్లింది. త్వరలో ఆ స్క్రిప్టును స్పిల్ బర్గ్ డైరెక్ట్ చేయనున్నాడు. 'మోన్టెజుమా' టైటిల్ తో ఉన్న కథకు ప్రధాన పాత్రలో ఆస్కార్ అవార్డు నటుడు జేవియర్ బార్డం ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 1519లో అజ్టెక్ నాయకుడు మోన్టెజుమా, స్పానిష్ అన్వేషకుడు కార్టెజ్ మధ్యగల వివాదాలతో... రచయిత డాల్టన్ ట్రుంబొ కథను ఆసక్తికరంగా మలచాడు. కానీ, ఆ స్క్రిప్టు మరుగున పడిపోయింది. ప్రస్తుతం హాలీవుడ్ నిర్మాణ సంస్థ డ్రీమ్ వర్క్స్ ఈ కథను తీసుకుని టైటిల్ మార్పుతో నిర్మించాలనుకుంటోంది.

  • Loading...

More Telugu News