: శాసనసభ రేపటికి వాయిదా
శాసనసభ రేపటికి వాయిదా పడింది. చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి తన వాదన వినిపిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సిగ్గుందా? అంటూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని లేపాయి. ఎర్రబెల్లి ఆరోపణలపై సమాధానమిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, చంద్రబాబును వెన్నుపోటు దారుడిగా అభివర్ణించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితిలో, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క సభను రేపు ఉదయం 9 గంటలకు వాయిదా వేశారు.