: సలహా ఇస్తారనుకుంటే.. రెచ్చగొడితే ఎలా: డిప్యూటీ స్పీకర్


శాసనసభలో ప్రభుత్వ విప్ గండ్ర మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉండగా తెలంగాణ అనే హక్కు కూడా లేకుండా చేశారంటూ చేసిన ఆరోపణలపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. సజావుగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తింది వైఎస్సార్ కాదా? అని ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు తెలంగాణకు అనుకూలమని తెలిపారని, రెండు ప్రాంతాలకు న్యాయం చేయమంటున్నారని... దానిని తప్పు పడితే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాడి వేడిగా సంభాషణ జరిగింది. దీంతో డిప్యూటీ స్పీకర్ అతని మైక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఎర్రబెల్లి దయాకర్ రావు గారూ, సభ సజావుగా నడిచేందుకు సలహా ఇస్తారనుకుంటే రెచ్చగొట్టేలా మాట్లాడితే ఎలా' అంటూ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News