: 84 మంది సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థల డైరెక్టర్లకు జైలు శిక్ష
సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థల ఆదాయపన్ను ఎగవేత కేసులో నాంపల్లి కోర్టు ఈ రోజు కీలక తీర్పునిచ్చింది. సత్యం కంప్యూటర్స్ కు చెందిన 19 అనుబంధ సంస్థలకు చెందిన 84 మంది డైరెక్టర్లకు కోర్టు శిక్షను ఖరారు చేసింది. శిక్షకు గురైన వారిలో రామలింగరాజు భార్య నందిని, కుమారుడు రామరాజు, సోదరుడి భార్య రాధ ఉన్నారు. వీరితో పాటు మరో 81 మంది డైరెక్టర్లకు జైలు శిక్ష పడింది. వీరిలో మహిళా నిందితులకు ఆరు నెలలు, మిగిలిన వారికి ఏడాది పాటు శిక్షను విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది.