: మోసగిస్తూ బతుకుతున్న పార్టీ.. టీఆర్ఎస్: జగ్గారెడ్డి
తెలంగాణ ప్రజలను మోసం చేసి బతుకుతున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఇలా స్పందించారు. కె.చంద్రశేఖరరావు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంత కార్మికులకు న్యాయం చేయాలని కోరినా పట్టించుకోలేదని అన్నారు. ఈ మాటలకు టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ జోక్యం చేసుకుని సభలో లేని వారి గురించి మాట్లాడడం సరికాదన్నారు.