: వట్టి 'మేము' అనకూడదు: పొన్నాల
మంత్రి వట్టి వసంతకుమార్ శాసనసభలో తన అభిప్రాయం చెప్పాలి కాని, 'మేము' అంటూ అందరి అభిప్రాయాలు చెప్పకూడదని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అభ్యంతరం చెప్పారు. 'మేము' అనే పదాన్ని రికార్డులనుంచి తొలగించాలని ఆయన కోరారు. దీనిపై వట్టి సమాధానమిస్తూ తాను 'మేము' అన్నది తమ ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకునే అని, శాసనసభ్యులను దృష్టిలో ఉంచుకుని కాదని స్పష్టం చేశారు. ఉపయోగించకూడని భాషేదీ తాను వాడలేదని వట్టి స్పష్టం చేశారు.