: దేశానికి మంచి రోజులు వస్తాయి: మోడీ
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని, అప్పుడు నిజంగానే దేశానికి మంచి రోజులు వస్తాయని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తెలిపారు. ఢిల్లీలో ప్రవాస భారతీయ దివస్ లో ఆయన మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక ప్రధాని అన్నట్టు దేశానికి మంచి రోజులు వస్తాయని అన్నారు. దేశ ఐక్యతకోసం పోరాడిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి సాయపడాలని ప్రవాస భారతీయులను కోరారు. పటేల్ వల్లే మనం స్వతంత్ర భారతాన్ని చూస్తున్నామని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడేందుకు మనం చాలా కష్టపడుతున్నామని ఆయన తెలిపారు.