: ఆర్మీ చీఫ్ కారు వెళ్లాలంటూ.. మంత్రి గారి కారును ఆపేశారు!


ఆయన కేంద్ర మంత్రి జైరాం రమేశ్.. హోదాలో జైరాంకంటే తక్కువైన ఆర్మీ చీఫ్ వెళ్లేందుకు.. ఏకంగా ఆయన కారునే ముందుకు పోనీయకుండా ఆపేశారు వీర విధేయ సైనికులు. తానొక సమావేశంలో పాల్గొనేందుకు వెళుతుండగా.. ఢిల్లీలో ఆర్మీ చీఫ్ నివాసం వద్ద సైనికులు తన కారును ఆపేశారని జైరాం వాపోయారు. అసలేంటీ ఈ వీఐపీ సంస్కృతి? దీన్ని దేశం నుంచి నిర్మూలించాలంటూ మండిపడ్డారు. కేంద్ర మంత్రి అయినా జైరాం రమేశ్ తన కారుపై ఎర్రబుగ్గను వాడరు. నిరాడంబరంగానే ఉంటారు. తాను ఎదుర్కొన్న అనుభవంపై రక్షణశాఖ మంత్రి ఆంటోనీకి లేఖ రాయనున్నట్లు చెప్పారు. ఆంటోనీ కూడా వ్యక్తిగత భద్రతకు దూరంగా ఉంటారని.. అలాంటిది సైన్యాధికారులకు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు వారికంటూ పోలీసులు ఉండడం దారుణమన్నారు. ఇది తప్పని.. ట్రాఫిక్ ను ఢిల్లీ పోలీసులే క్రమబద్ధీకరించాలని.. దీనిని ఆంటోనీ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.

  • Loading...

More Telugu News