: గుండెపోటుకు కూడా ధనిక, పేద తేడా ఉందటండోయ్!


గుండెపోటుకు కూడా ధనిక, పేద అనే తేడా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ధనికుల కంటే పేదవాళ్లకే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వికీమైర్స్ తెలిపారు. వికీమైర్స్, యరివ్ గెర్బర్ లు ధనిక, పేద వర్గాల ప్రజల్లో గుండె జబ్బులు గుర్తించేందుకు 40 రకాల ఆరోగ్య సూచికలు రూపొందించారు. ఇవి గుండెపోటు నిర్ధారణలో బలహీనత అంశాన్ని నిర్ధారిస్తాయి. వీరు 2010 నుంచి 2013 మధ్య కాలంలో గుండెపోటు వచ్చిన దాదాపు 1151 మంది రోగుల వైద్య రికార్డుల సాయంతో పరిశోధనలు సాగించారు.

గుండెపోటు వచ్చిన 35 శాతం మంది తరువాత పదేళ్లలో బాగా బలహీనపడ్డారు. వీరంతా బాగా ఆర్థికంగా వెనుకబడినవారు, సామాజిక ఇబ్బందులకు గురవుతున్నవారు. వీరంతా క్షీణించిపోవడానికి నిరక్షరాస్యత, తక్కువ కుటుంబ ఆదాయం, నిర్లక్ష్యంగా ఉండడం కారణమని పరిశోధకులు తెలిపారు. ఆరోగ్యం గురించి పట్టించుకోని కారణంగా మొత్తం గుండె పోటు వచ్చిన వారిలో... పేదవాళ్లే ఎక్కువ మందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News