: తెలంగాణ వాళ్లకు ఉన్న సెంటిమెంటే మాకు ఉంది: వట్టి వసంతకుమార్


ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా మంత్రి వట్టి వసంతకుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ పై ఎలా సెంటిమెంట్ ఉందో తమకు అలాగే ఉందని పేర్కొన్నారు. అయితే, విభజన అంటే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన తనకే బాధ కలుగుతోందని.. విభజిస్తే ఆంధ్రపదేశ్ లో పుట్టిన వాళ్లకు ఎంత బాధ కలుగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. అందరి మనోభావాలకు విరుద్ధంగా వ్యవహారం నడుస్తోందని, రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి హైదరాబాదు చుట్టూ కేంద్రీకృతమై ఉందన్న మంత్రి ఇప్పటివరకూ విభజన అంశంపై ఏకాభిప్రాయం సాధించామా? అని ప్రశ్నించారు.

విభజన అంటూ తమను దోపిడీ దారులన్నారని.. ఈ ఆరోపణలు తప్పని శ్రీకృష్ణ కమిటీ నివేదిక నిరూపించిందన్నారు. తాము, తమ పూర్వీకులు తప్పు చేసినట్లు నిరూపిస్తే సరిదిద్దుకుంటామన్నారు. శ్రీకృష్ణ కమిటీ చెప్పిన ఐదో ప్రతిపాదనకు విలువ ఉందన్నారు. మెజార్టీ ప్రజలు, ప్రజాప్రతినిధులు విభజనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ను పేల్చేస్తామని ఓ ఎంపీ(పొన్నం) వ్యాఖ్యానించారని, అంతేకాక సీఎం బ్యాటింగ్ చేస్తే బంతులకు బదులు బాంబులు వేస్తామని కేసీఆర్ కుమార్తె కవిత అన్న వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ సమయంలో టీఆర్ఎస్ నేతలు గట్టిగా అరుస్తూ నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News