: ఈ టూత్ బ్రష్.. మీరు సరిగా చేస్తున్నారా? లేదా? చెప్పేస్తుంది
ఎక్కువ మందికి పళ్ళని ఎలా బ్రష్ చేసుకోవాలో తెలియదు. తెలిసిన వారు కూడా శుభ్రంగా బ్రష్ చేసుకుంటారని చెప్పలేం. ఏదో అయిందిలే అనిపించేస్తుంటారు. కానీ, ఇకపై బ్రష్ చేస్తున్నప్పుడే.. ఎలా చేస్తున్నారు? ఏ భాగంలోనైనా చేయకుండా వదిలేశారా? అని చెప్పే బ్రష్ వచ్చేసింది. కొలిబ్రీ అనే ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ బ్లూటూత్ తో స్మార్ట్ ఫోన్ కు అనుసంధానం చేసుకుంటే సరి. లాస్ వెగాస్ లో ఈ వారం జరిగిన సీఈఎస్ గాడ్జెట్ షోలో దీన్ని ప్రదర్శించారు. ఫ్రాన్స్ కు చెందిన థామస్ దీన్ని ఆవిష్కరించారు.