: విభజన జరిగితే కోస్తాంధ్ర 50 ఏళ్లు వెనక్కి వెళుతుంది: మంత్రి వట్టి


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై శాసనసభలో మంత్రి వట్టి వసంతకుమార్ చర్చ ప్రారంభించారు. బిల్లుపై నిన్న రెండు నిమిషాలు మాట్లాడినప్పటికీ సభ ఈ రోజుకు వాయిదాపడటంతో మళ్లీ ఈ రోజు చర్చ మొదలుపెట్టారు. విభజన బిల్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉందని, విభజన జరిగితే కోస్తాంధ్ర యాభై ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని ఆయన అన్నారు. దీనిద్వారా సమాఖ్య స్పూర్తిపై యూపీఏ ప్రభుత్వానికి అసలు గౌరవం లేనట్టుగా ఉందన్నారు. అసలు కేంద్రం విభజనపై ఎందుకంత అత్యుత్సాహంతో ముందుకు వెళుతుందో అర్ధం కావడంలేదన్న వట్టి, శాసనసభ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియ చేపట్టడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఖండించారు. ఏళ్ల తరబడి విదర్భ డిమాండ్ ఉన్నా పట్టించుకోలేదని, విభజన కోసం యూపీ అసెంబ్లీ తీర్మానం చేసినా అదీ పట్టించుకోలేదని మంత్రి వట్టి గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News