: ఈ నెల 20, 21న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సమ్మె
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సమ్మె చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఈ నెల 20, 21 తేదీల్లో 48 గంటల పాటు సమ్మె చేయనున్నట్లు జాతీయ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల అధికారుల సంఘం తెలిపింది. 57 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పని చేస్తున్న 79వేల మంది సిబ్బంది సమ్మెలో పాల్గొననున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, నూతన సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు శగున్ శుక్లా తెలిపారు. వాణిజ్య బ్యాంకుల విలీన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, గ్రామీణ బ్యాంకులను తక్షణమే ఏకీకరణ చేయాలని ఆర్ఆర్ బీ జాతీయ సంఘం డిమాండ్ చేసింది.