: ఐటమ్ గర్ల్ అనడం అవమానించడమే: మలైకా అరోరా
బాలీవుడ్ నటి మలైకా అరోరా తనను ఐటమ్ గర్ల్ అనడాన్ని తప్పుబట్టింది. ఛయ్య.. ఛయ్య తదితర గీతాల్లో నాట్యమాడిన ఈ నటి.. ఐటమ్ గర్ల్ అనడం అగౌరవనీయమని, అలా అనడం తనకు నచ్చదని స్పష్టం చేసింది. ఎందుకు దాన్ని ప్రత్యేక గీతంగా చూడరంటూ ప్రశ్నించింది. ఇటీవల కరీనాకపూర్, దీపికా పదుకునే తదితరులు కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తుండడంతో 'మీ స్థానాన్ని వాళ్లు భర్తీ చేస్తున్నారా?' అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అలా అని అనుకోవడం లేదని చెప్పింది.