: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్


శాసనసభకు అంతరాయం కలిగిస్తున్న 15 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సభలో చర్చకు సహకరించకుండా, అడ్డుపడుతున్నందుకే వీరిని సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శైలజానాథ్ వీరి పేర్లను శాసన సభలో చదివి వినిపించారు. సభను సజావుగా కొనసాగించడానికి సస్పెన్షన్ మినహా మరోదారి లేదని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. సస్పెండయిన ఎమ్మెల్యేలను మార్షల్స్ సభ నుంచి బయటకు తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News