: తెలంగాణ కోరిక రాజకీయ డిమాండు కాదు: హరీష్ రావు


అవిశ్వాస తీర్మానంపై శాసనసభలో మొదలైన చర్చలో టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలంగాణపై తన సుదీర్ఘ వాదనను వినిపిస్తున్నారు. తెలంగాణకు మొదటి, అసలైన శత్రువు కాంగ్రెస్సేనని సూటిగా ధ్వజమెత్తారు. తెలంగాణ కోరిక రాజకీయ డిమాండు కాదని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల తరతరాల వాంఛ, ఎడతెగని పోరాటమేనని తెలిపారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించిన హరీష్ రావు, 1956లో ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణ విలీనాన్ని ప్రజలు వ్యతిరేకించారన్నారు.

1969లో తెలంగాణ ఉద్యమాన్ని 
రక్తసిక్తం చేసింది కాంగ్రెస్సేనని ఆరోపించా రు. ఇక రాష్ట్రానికి పేరు పెట్టే సమయంలోనూ కాంగ్రెస్ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చకుండా కాంగ్రెస్ చెలగాటమాడుతోందని దుయ్యబట్టారుఏ పార్టీ అధికారంలో ఉన్నా చివరికి దోపిడీకి గురైంది, గురవుతున్నది తెలంగాణ ప్రాంతమేనని వివరించారు. తెలంగాణ ప్రజలకు పార్టీలపైనా, ప్రభుత్వాలపైన కాకుండా పోరాటం మీదే నమ్మకం ఉందని వెల్లడించారు.

ఎన్టీఆర్ తీసుకొచ్చిన 610 జీవో నేటికీ అమలు కాలేదని, జీవో అమలు చేయకుండా మోసం చేసింది కూడా కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పెట్టడం బాధాకరమేననీ, అయినా తప్పడం లేదన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ నిరాహారదీక్ష చేశారని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గడువు పెట్టి హేళన చేశారన్నారు. ఇడ్లీ, దోశలతో తెలంగాణను పోల్చి ప్రజల హృదయాలను గాయపర్చారన్నారు. 36 రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినా, ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పార్టీని చీల్చి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శించారు.
             

  • Loading...

More Telugu News