: మేము చర్చకు వ్యతిరేకం కాదు: వైయస్ విజయమ్మ


విభజన బిల్లుపై చర్చకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ స్పష్టం చేశారు. సభను అడ్డకోవడం తమ అభిమతం కాదని తెలిపారు. ఆమె ఈ రోజు శాసనసభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు సభలో లేనప్పుడు సభలో బిల్లును ప్రవేశపెట్టడం దురదృష్టకరమని చెప్పారు. (కిరణ్, చంద్రబాబుల పేర్లను విజయమ్మ ప్రస్తావించడంతో... ఆమె మాట్లాడుతున్నంత సేపు సభలో గందరగోళం నెలకొంది.) ఆర్టికల్-3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారమున్నా... ఇష్టానుసారం వ్యవహరించరాదని కోరారు. బిల్లుపై చర్చించిన తర్వాత ఓటింగ్ జరుగుతుందన్న నమ్మకం తమకు లేనందునే... ముందే ఓటింగ్ పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. తాము సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News