: బీజేపీలోకి యడ్యూరప్ప పునరాగమనం నేడే
అలకలు, ఆగ్రహంతో భారతీయ జనతా పార్టీ నుంచి బయటికెళ్లిన బీఎస్ యడ్యూరప్ప ఈ రోజు మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు. తాను స్థాపించిన కర్ణాటక జనతా పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నారు. దాంతో, కమలదళంలో మళ్లీ యెడ్డీకి అధిష్ఠానం సముచిత స్థానం కల్పించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అధికారం చేజిక్కించుకునే ప్రణాళికలో భాగంగా బీజేపీ యెడ్డీని ఆహ్వానించింది. యెడ్డీ రాకతో కర్ణాటక రాజకీయాల్లో తన కేడర్ మరింత బలపడే అవకాశముందని బీజేపీ భావిస్తోంది.