: లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. 200 మందితో తొలి జాబితా
రానున్న లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో, విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా 200 లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా, తమ ఎన్నికల మేనిఫెస్టోను తయారుచేసే క్రమంలో... యువత, మేధావుల సలహాలు, సూచనలు తీసుకోవాలని భావిస్తోంది. ఈలోగానే ముంబై, భోపాల్, ఉత్తరప్రదేశ్ లలో రాహుల్ గాంధీ పర్యటించి, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఎన్నికల వేడిని రగిలించాలని ప్లాన్ వేసింది.