: ఈ ఏడాదికి తొలి సౌరాగ్రహ జ్వాల ఎగసింది


సాధారణంగా సూర్యుడిలో మంటలు ఎగసిపడుతుంటాయి. కానీ గత కొంతకాలంగా సూర్యుడిలో జ్వాలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలంపై వస్తున్న మార్పులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాదిలో తొలిసారిగా సూర్యుడి ఉపరితలంపై జ్వాల ఎగసిపడినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసాకు చెందిన శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలం మీద దశాబ్దకాలంలో కనిపించిన పెద్ద మచ్చల సమూహంలో ఒకదాని నుండి భారీ జ్వాల ఎగసిపడిందని వివరించారు.

సాధారణంగా సూర్యుడినుండి ఇలా ఎగసిపడిన జ్వాల కారణంగా శక్తిమంతమైన రేడియోథార్మికత వెలువడుతుంది. దీనివల్ల మనుషులకు, జంతువులకు హాని కలుగుతుంది. కానీ ప్రస్తుతం ఎగసిన జ్వాల నుండి వెలువడిన రేడియో ధార్మికత భూవాతావరణాన్ని దాటుకొని రాలేదని, కాబట్టి భూమిపైన ఉన్న జీవరాశులకు ఎలాంటి హాని కలగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే రేడియో థార్మికత చాలా ఎక్కువగా ఉంటేమాత్రం ప్రపంచ స్థిత వ్యవస్థ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌`జీపీఎస్‌)ను సూచించే ఉపగ్రహాలు ఉండే పొరలోని వాతావరణాన్ని, సమాచార ప్రసార సంకేతాలను ఈ రేడియో ధార్మికత అస్తవ్యస్తం చేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News