: దీనితో మెమరీ పెరుగుతుంది


వయసు పెరుగుతున్నకొద్దీ మెమరీ పవర్‌ తగ్గుతూ వస్తుంది. అయితే, కొందరికి వయసు పెరిగినా మెమరీ మాత్రం తగ్గదు. ఇలా కొందరిలో జ్ఞాపకశక్తి తరగకుండా ఉండడానికి, మరికొందరిలో మతిమరుపు రావడానికి కారణం రక్తంలోని ఒక విటమినేనని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. రక్తంలో విటమిన్‌ 'ఇ' మోతాదు ఎక్కువగా ఉన్న వయసుమీరిన వృద్ధుల్లో జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది.

ఈస్టర్న్‌ ఫిన్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయం, పెరూజియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు విటమిన్‌ 'ఇ' కి, జ్ఞాపకశక్తి సమస్యలకు మధ్యగల సంబంధంపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు. మామూలుగా అయితే ఇలాంటి అధ్యయనాల్లో పరిశోధకులు విటమిన్‌ 'ఇ' లో ఒకరకమైన అల్ఫా-టోకోఫెరాల్‌ పైనే దృష్టి పెడుతుంటారు. అలాకాకుండా వీరు విటమిన్‌ 'ఇ' కి సంబంధించిన అన్ని రూపాలపైన దృష్టి సారించారు. నిజానికి 'ఇ' విటమిన్‌ ఎనిమిది రూపాల్లో ఉంటుంది.

ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలను కలిగివున్నవే. ముఖ్యంగా గామా-టోకోఫెరాల్‌, బీటా-టోకోట్రైనాల్‌, టోకోట్రైనాల్‌ ఇవన్నీ కూడా జ్ఞాపకశక్తి సమస్యలనుండి కాపాడుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు వివరించారు. రక్తంలో ఉండే విటమిన్‌ 'ఇ' ఇలా వివిధ రూపాల్లో మన జ్ఞాపకశక్తి ప్రక్రియలో పాలుపంచుకుంటున్నట్టు తేలిందని పరిశోధకులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News