: అవిశ్వాస తీర్మానంపై సభలో మొదలైన చర్చ,45 మంది సభ్యుల మద్దతు
టీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శాసనసభలో చర్చ మొదలైంది. అర్ధగంట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ముందుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతున్నారు. అంతకుముందు సభాపతి అనుమతి ఇవ్వడంతో సభలో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఇందుకు 45 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో సభను వాయిదా వేసి బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ అవిశ్వాస తీర్మానంపై ఈ రోజే సభలో చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 8 గంటల పాటు సభలో చర్చ జరుగనుంది.