: హైదరాబాద్ చేరుకున్న రాజ్ నాథ్ సింగ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రాత్రి 8 గంటలకు పార్టీ రాష్ట్ర స్థాయి పదాధికారులతో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం జరుగనున్న ఆర్ఎస్ఎస్ సమావేశంలో పాల్గోనున్నారు.