: విభజనకు చర్యలన్నీ కేంద్రమే తీసుకుంది: డీఎస్
రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలన్నీ కేంద్ర ప్రభుత్వమే తీసుకుందని పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. తెలంగాణ కోసం గట్టిగా కృషి చేశానని డీఎస్ తెలిపారు. కొన్ని సార్లు తెలంగాణ సాధించగలమా? అని ఆందోళన చెందానని, అయితే సోనియాగాంధీ ఎలాంటి ఆందోళన చెందలేదని అన్నారు. విభజన సాఫీగా జరుగుతుందని సోనియా హామీ ఇచ్చారని డీఎస్ చెప్పారు. వచ్చే నెల పార్లమెంటులో మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన స్పష్టం చేశారు.