: చివరి వన్డేలో ఓడిన కివీస్.. సిరీస్ డ్రా


న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ చివరి వన్డేలో కివీస్ 203 పరుగుల తేడాతో విండీస్ చేతిలో చిత్తయ్యింది. దీంతో సిరీస్ లో రెండు జట్లు రెండేసి వన్డేలు గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నాలుగు వికెట్ల నష్టానికి 363 పరుగులు సాధించింది. కిర్క్ ఎడ్వర్డ్(123), డ్వేన్ బ్రావో(106)లు సెంచరీలతో కదంతొక్కారు.

అనంతరం బరిలోకి దిగిన కివీస్ 160 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాట్స్ మన్ లలో ఆండర్సన్(29) టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం. దీంతో 203 పరుగుల తేడాతో కివీస్ ఓటమిపాలైంది. డ్వేన్ బ్రావోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో రెండు జట్లు చెరి రెండు వన్డేల్లో గెలుపొందగా, ఓ వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో సిరీస్ సమమైంది.

  • Loading...

More Telugu News