: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం: జగన్


శాసనసభలో టీబిల్లుపై చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్లేనని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉప్పు నీరే ఉంటుందని అన్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లా సోమల గ్రామంలో సమైక్య శంఖారావం సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో 30 లోక్ సభ సీట్లు గెలుచుకుందామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దామని అన్నారు.

  • Loading...

More Telugu News