: జగన్ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే?
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. దీన్ని బలపరుస్తూ వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలపై జగన్ తో కలసి ఆయన ఫొటోలు కూడా ప్రత్యక్షమయ్యాయి. దీంతో యర్రం జగన్ గూటికి చేరుతారా? లేదా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? అంటూ నియోజకవర్గ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంలో మరో ట్విస్ట్ ఏమిటంటే, వెంకటేశ్వరరెడ్డి ఫ్లెక్సీల వ్యవహారంపై ఇంతవరకు స్పందించలేదు.