: సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉండేందుకు మేం ఒప్పుకోం: రేవూరి
సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉండేందుకు తాము ఒప్పుకోమని తెలంగాణ టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, బిల్లులో ఉద్యోగుల విషయంలో ఆప్షన్ అనే పదం తొలగించాలని... లేని పక్షంలో దానికి తాము కట్టుబడి ఉండమని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ ప్రాంతాన్ని వీడాల్సిందేనని ఆయన పునరుద్ఘాటించారు.