: 12.4 కేజీల దొంగ బంగారం స్వాధీనం
ఈ రోజు దేశంలోని మెట్రోనగర విమానాశ్రయాల్లో విదేశాల నుంచి పెద్దఎత్తున అక్రమ రవాణా అవుతున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, కోల్ కతా, చెన్నై నగరాల్లో అక్రమంగా రవాణా అవుతున్న సుమారు 12.4 కేజీల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దోహా నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ తండ్రీకూతళ్లు 1.2 కేజీల తొమ్మిది బంగారం బిస్కెట్లను తీసుకొచ్చారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని తనిఖీ చేయడంతో బండారం బయటపడింది. వీరితో పాటు మరో వ్యక్తిని కూడా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కోల్ కతాలోని ఎన్ఎస్ఈ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4.2 కేజీల దొంగ బంగారాన్ని దిలీప్ రావు, ప్రకాశ్ వాల్మీకి అనే వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 7 కేజీల దొంగ బంగారాన్ని ఓ వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.